ముగించు

ఎలా చేరుకోవాలి?

రవాణా మార్గాలు:

వాయు:

దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుండి వరంగల్ కు రెగ్యులర్ విమానాలు లేవు. వరంగల్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగుళూరు మరియు ఇతర దేశాల విమానాలు అనుసంధానించబడి ఉన్నాయి.విమానాశ్రయం నుండి, టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి.

 

రైలు:

రైలు ద్వారా భారతదేశంలోని ప్రధాన నగరాలకు వరంగల్ బాగా అనుసంధానించబడి ఉంది. హైదరాబాద్-న్యూఢిల్లీ, చెన్నై-కోలకతా మార్గంలో వరంగల్ ప్రధాన రైల్వే జంక్షన్. స్టేషన్ నుండి ఆటో-రిక్షాలు మరియు బస్సులు అందుబాటులో ఉన్నాయి.

 

రహదారి:

వరంగల్ రోడ్డు మార్గం ద్వారా బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి, అనంతపురం, హుబ్లీ మరియు బెల్గాం కి డైరెక్ట్ బస్సులు కలవు.వరంగల్ నుండి గరుడ,రాజదాని, డీలక్స్ బస్సులతో అనుసంధానించబడి ఉంది.వరంగల్ నుండి హైదరాబాద్ కు 15 నిమిషాలు ఒక్క బస్సు కలదు, రాష్ట్ర రాజధాని కి సుమారు మూడు గంటలు పడుతుంది.

వరంగల్ సందర్శించడానికి ఉత్తమ సమయం:

అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, మార్చ్ నుండి మే వరకు పర్యాటకులు సందర్శిస్తారు. జూన్ నుండి సెప్టెంబరు వరకు ఈ ప్రాంతం భారీ రుతుపవనాలు అనుభవిస్తుంది. బతుకమ్మ, ఇడ్-ఉల్-ఫితర్, సమ్మక్క-సారక్క జాతర, దసరా మరియు దీపావళి వంటి పండుగలలో చాలా మంది పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శిస్తారు.