ముగించు

జిల్లా సంక్షేమ అధికారి, మహిళా అభివృద్ది, శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, వరంగల్ అర్బన్

ఉపోద్ఘాతము::

జిల్లా సంక్షేమ అధికారి, మహిళా అభివృద్ది, శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, వరంగల్ అర్బన్ ఆదినరంలో నడపబడుతున్న (7) ఐ.సి.డీ.ఏస్ ప్రాజెక్ట్ లు పరిధిలో (1605) మెయిన్ అంగన్ వాడి కేంద్రములు మరియు (291) మినీ అంగన్వాడి కేంద్రములు నడపబడు చున్నవి. ఈ కేంద్రములలో, గర్భవతులు, బాలింతలు మరియు 6నెలల నుండి 6 సంవత్సరాల వరకు పిల్లలు ఈ క్రింద తెలుపబడిన సేవలను ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పొందుచున్నారు.

  1. పోషకాహార పథకం
  2. ఆరోగ్యలక్ష్మి ఒక్క పూట పూర్తి భోజన పథకం
  3. పూర్వ ప్రాధమిక విద్య
  4. వ్యాధి నిరోధక టీకాలు
  5. ఆరోగ్య పోషణ విద్య

మరియు వికలాంగుల మరియు వయోవృద్ధుల విభాగం లో ఈ క్రింద పథకాలు అమలగుచున్నవి.

  1. వివాహా ప్రోత్సాహక బహుమతి
  2. స్వయం ఉపాధి పథకం
  3. ఉపకారవేతనము (1తరగతి నుండి 10 తరగతి వరకు)
  4. ఉపకారవేతనము ( ఇంటర్ మరియు ఆ పై తరగతి వారికి )
  5. సహాయక ఉపకరణాలు.

జిల్లా సంక్షేమ అధికారి, మహిళా అభివృద్ది, శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, వరంగల్ అర్బన్ క్రింద అమలగుచున్న పధకముల వివరాలు:

మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ విభాగం:

  1. పోషకాహార పథకం:పోషకాహార పధకం క్రింద 6నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకి బాలామృతం టి.హెచ్.ఆర్ రూపంలో అంగన్ వాడి కేంద్రములలో ఇంటికి ఇస్తారు. మరియు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకి అంగన్ వాడి కేంద్రములలో భోజనం అందిస్తారు.
  2. ఆరోగ్యలక్ష్మి ఒక్క పూట పూర్తి భోజన పథకం:తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మక౦గా ఆరోగ్యలక్ష్మి ఒక్క పూట పూర్తి భోజన పథకాన్ని గర్భవతులు మరియు బాలింతలకు 1st జనవరి 2015 నుండి అంగన్ వాడి కేంద్రములలో ప్రవేశ పెట్టినది. ఈ పధకం క్రింద గర్భవతులు మరియు బాలింతలకు ఒక్క పూట పూర్తి భోజన౦తో పాటు ఒక కోడిగుడ్డు మరియు 200 యం ల్ పాలు ఇవ్వటం జరిగుతోంది.
  3. పూర్వ ప్రాధమిక విద్య:అంగన్ వాడి కేంద్రములలో 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకి ఆటపాటలతో పూర్వ ప్రాధమిక విద్య అందించబడుచున్నది.
  4. వ్యాధి నిరోధక టీకాలు:అంగన్ వాడి కేంద్రముల ద్వారా ఆరోగ్య పరిక్షలు, రేఫరల్ సేవలు మరియు ఆరోగ్య పోషణ విద్య కార్యక్రమాలు అందించబడుచున్నవి.
  5. ఆరోగ్య పోషణ విద్య:ఆరోగ్య పోషణ విద్య ద్వారా అంగన్ వాడి కేంద్రములలో తల్లులకు నెలలో రెండు సార్లు పిల్లల సంరక్షణ, నవజాత శిశువు ఆహారం మరియు ఆరోగ్య సేవలు వినియోగించుట గురించి కౌన్సిలింగ్ నిర్వహించటం జరుగుతుంది.

 

వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ విభాగం:

  1. వివాహా ప్రోత్సాహక బహుమతి – సకలంగులు మరియు వికలాంగులు కలిసి వివాహం చేసుకున్న వారికి 50,000/- మంజూరు చేయబడును.
  2. స్వయం ఉపాధి పథకం- బ్యాంకు అంగీకార పత్రం తో 80% వరకు సబ్సిడి మంజూరు చేయబడును.
  3. ఉపకారవేతనము ( ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ నందు ఒకటవ తరగతి నుండీ పడవ తరగతి వరకు చదువుతున్న వారికి )
  4. ఉపకారవేతనము ( ఈ పాస్ ద్వారా వికలాంగులకు ఇంటర్ మరియు ఆ పై తరగతులు చదువుతున్న వారికి మంజూరి చేయబడును).
  5. సహాయక ఉపకరణాలు వికలాంగులకు తెలంగాణా వికలాంగుల కార్పోరేషన్, హైదరాబాదు వారు మూడు చక్రాములు బంద్లు, సంక కర్రలు, వీలచైర్, శ్రవణ యంత్రం, వాకింగ్ స్తికు, పెట్రోల్ మోటార్ సైకిల్ మంజూరి చేయబడును. మరియు వయోవృద్ధుల కార్డు ఇవ్వబడును.

 

తాజా ప్రగతి నివేదిక::

  1. మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ విభాగం:
    • పోషకాహార పథకం:పోషకాహార పధకం క్రింద (39226) 6నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకి బాలామృతం టి.హెచ్.ఆర్ రూపంలో అంగన్ వాడి కేంద్రములలో అందిస్తారు. మరియు (25354) 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకి అంగన్ వాడి కేంద్రములలో భోజనం అందిస్తారు.
    • ఆరోగ్యలక్ష్మి ఒక్క పూట పూర్తి భోజన పథకం::
    • పూర్వ ప్రాధమిక విద్య:అంగన్ వాడి కేంద్రములలో (26517) 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకి ఆటపాటలతో పూర్వ ప్రాధమిక విద్య అందించబడుచున్నది.
    • వ్యాధి నిరోధక టీకాలు:అంగన్ వాడి కేంద్రముల ద్వారా ఆరోగ్య పరిక్షలు, రేఫరల్ సేవలు మరియు ఆరోగ్య పోషణ విద్య కార్యక్రమాలు అందించబడుచున్నవి.
    • ఆరోగ్య పోషణ విద్య:ఆరోగ్య పోషణ విద్య ద్వారా అంగన్ వాడి కేంద్రములలో తల్లులకు నెలలో రెండు సార్లు పిల్లల సంరక్షణ, నవజాత శిశువు ఆహారం మరియు ఆరోగ్య సేవలు వినియోగించుట గురించి కౌన్సిలింగ్ నిర్వహించటం జరుగుతుంది.
  2. వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ విభాగం:
    • వివాహా ప్రోత్సాహక బహుమతి:: 2017-18 సంవత్సరంలో (49) సకలంగులు మరియు వికలాంగులు కలిసి వివాహం చేసుకున్న వారికి 36.00 లక్షలు మంజూరు చేయటం జరిగింది.
    • స్వయం ఉపాధి పథకం:: 2017-18 సంవత్సరంలో (36) మందికి బ్యాంకు అంగీకార పత్రం తో 18.00 లక్షలు మంజూరు చేయటం జరిగింది.
    • ఉపకారవేతనము:: (ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ నందు ఒకటవ తరగతి నుండీ పడవ తరగతి వరకు చదువుతున్న వికలాంగులకు వారికి 2017-18 సంవత్సరంలో (162) మందికి 1.69 లక్షలు మంజూరు చేయటం జరిగింది.
    • ఉపకారవేతనము::ఈ పాస్ ద్వారా వికలాంగులకు ఇంటర్ మరియు ఆ పై తరగతులు చదువుతున్న వారికి 2017-18 సంవత్సరంలో (02) మందికి 0.28 లక్షలు మంజూరు చేయటం జరిగింది.
    • సహాయక ఉపకరణాలు:: 2017-18 సంవత్సరంలో వికలాంగులకు, తెలంగాణా వికలాంగుల కార్పోరేషన్, హైదరాబాదు వారు (20) మందికి మూడు చక్రాములు బంద్లు, సంక కర్రలు, వీలచైర్, శ్రవణ యంత్రం, వాకింగ్ స్తికు, పెట్రోల్ మోటార్ సైకిల్ మంజూరు చేసినారు.

జిల్లా సంక్షేమ అధికారి,
వరంగల్ అర్బన్